ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఏలూరు పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ.. బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధుశేఖర్, శింగలూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే ఆరుగురి నిందితులు అరెస్ట్ చేసినట్లు వివరాలు వెల్లడించారు.
వారి వద్ద నుంచి రూ. 1,50,000 అసలు నోట్లు, రూ.12,00,000 నకిలీ నోట్లు, మూడు మోటార్ సైకిల్స్, నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేటతెల్లమయినట్లు వివరించారు. నిందితులపై 489బీ, 489సీ, R/W34 ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు.