పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ దక్కించుంది. దీంతో మేయర్ పీఠం వైఎస్సార్‌సీపీ వ‌శ‌మైంది. ఇప్పటికే వైసీపీ 42 డివిజన్లలో గెలుపొంద‌గా.. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. మరో 2 డివిజన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 42 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం డివిజన్లలో సగం కంటే ఎక్కువ ఇప్పటికే వైసీపీ ఖాతాలో చేరడంతో ఆ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం లాంఛనం కానుంది. ఇప్పటి వరకు వైసీపీ 42 చోట్ల,టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. 2, 4, 5, 10, 11, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. 28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తయింది. 14, 16 డివిజన్ల ఫలితాలు మాత్రమే ఇంకా వెల్లడికావాల్సి ఉంది. గతంలో ఏకగ్రీవమైన మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ 45 డివిజన్లలో గెలుపొందినట్లయింది.


సామ్రాట్

Next Story