రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై విజయవాడలో రెండో రోజూ కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష నిర్వహించింది. తొలిరోజు 18 జిల్లాల సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల బృందం శనివారం 8 జిల్లాల అధికారులతో చర్చలు జరిపింది. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు హాజరయ్యారు. పోలింగ్ సన్నద్ధతలో భాగంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రత, చెక్ పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. ఓటర్ల జాబితాలో ఎక్కువగా అవకతవకలు ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈవోకు కేంద్ర బృందం సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో బృందం చర్చలు జరుపుతోంది. శుక్రవారం నాడు 18 జిల్లాలపై సమీక్ష పూర్తికాగా.. శనివారం మరో 8 జిల్లాలపై ఈసీ బృందం సమీక్షిస్తోంది. చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై సీఈవోకు కొన్ని సూచనలు చేసింది.