40 మంది డీఎస్పీలకు పదోన్నతులు.. ప్రభుత్వం ఉత్తర్వులు.!
DSP Promotions In Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 40 మంది డీఎస్పీలకు అదనకు ఎస్పీలుగా
By అంజి Published on 1 Sept 2021 8:41 AM ISTఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 40 మంది డీఎస్పీలకు అదనకు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల పదోన్నుతల అంశం దాదాపుగా ఐదేళ్లుగా పెండింగ్ దశలో ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో పదోన్నతి గురించి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విషయమై డిపార్ట్ మెంటర్ ప్రమోషన్ కమిటీని నియమించిన వైసీపీ ప్రభుత్వం.. ఆ కమిటీ సిఫార్సు మేరకు తాజా పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అంశంపై కోర్టుల్లో గాని, ట్రిబ్యునల్‌లో గాని ఏవైనా కేసులు పెండింగ్ దశలో ఉంటే వాటి తీర్పులకు అనుగుణంగా ఉత్తర్వులను అమలు చేస్తామని హోంశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.
ఇక అదనపు డీస్పీలుగా కె.శ్రావణి, ఎం.చిదానందరెడ్డి, దిలీప్ కిరణ్ వండ్రు, సీహెచ్ సౌజన్య, ఏటీవీ రవి కుమార్, మహేంద్ర మాతే, ఎ. రాజేంద్ర, బి.శ్రీనివాసరావు. బి.విజయభాస్కర్, డి. ప్రసాద్. కె.శ్రీనివాసరావు, జె.కులశేఖర్, పూజిత నీలం, జె.వెంకట్రావ్, ఎం.స్నేహిత, వీబీ రాజ్ కమల్, డి.సూర్య శ్రావణ్ కుమార్, సి.జయరాంరాజు, ఇ.నాగేంద్రుడు, ఆర్.రమణ, జి.రామకృష్ణ, ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మీ, జి.వెంకటేశ్వరరావు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి. శ్రీభవానీ హర్ష, టి. ప్రభాకర్ బాబు, జి.స్వరూపరాణి, ఎ. శ్రీనివాసరావు, లింగాల అజయ్‌ప్రసాద్, ఏవీఆర్ పీవీ ప్రసాద్, బి.నాగభూషణరావు, పి. మహేష్‌లు పదోన్నతి పొందారు.