తిరుమల నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

తిరుమల నడక దారిలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం చెందారు.

By Medi Samrat
Published on : 25 Nov 2023 12:58 PM IST

తిరుమల నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

తిరుమల నడక దారిలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం చెందారు. మెట్ల దారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్ప కూలారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించడంతో పాటు శ్రీవారిని దర్శించుకోవాలని భావించారు. మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారు.

ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ 1,805 మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఆయన స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Next Story