ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

By Medi Samrat  Published on  7 Feb 2024 1:51 PM GMT
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని తెలిపారు.డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల పాటూ.. గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. టెట్‌, డీఎస్సీలకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పేపర్‌-1, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2 విడివిడిగా టెట్‌ నిర్వహించనున్నారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్‌ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story