మందు బాబు హల్‌చల్.. మద్యం బాటిల్‌తో తానే కొట్టుకొని, తననెవరో కొట్టారంటూ హంగామా

Drunken young man hulchul on road in ongole. మద్యం మత్తులో ఓ మందు హల్‌చల్‌ చేశాడు. నడిరోడ్డుపై గందరగోళం సృష్టించాడు. తనకు తానే కొట్టుకుని.. నన్నెవరో కొట్టారంటూ

By అంజి  Published on  13 Nov 2021 10:57 AM IST
మందు బాబు హల్‌చల్.. మద్యం బాటిల్‌తో తానే కొట్టుకొని, తననెవరో కొట్టారంటూ హంగామా

మద్యం మత్తులో ఓ మందు హల్‌చల్‌ చేశాడు. నడిరోడ్డుపై గందరగోళం సృష్టించాడు. తనకు తానే కొట్టుకుని.. నన్నెవరో కొట్టారంటూ హంగామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లో తాగిన మైకంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై నానా యాగీ చేశాడు. మత్తులో మద్యం బాటిల్‌ను తలకేసి కొట్టుకున్నాడు. ఆ తర్వాత తనను ఎవరో కొట్టారంటూ రచ్చ చేశాడు. తల నుండి రక్తస్రావం అవుతున్న రోడ్డు తులుతూ కిందపడి బోర్లాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు.. మద్యం తాగి రచ్చ చేస్తున్న వ్యక్తిని వారించారు. రోడ్డుపై పడుకుని తనను కొంతమంది దారుణంగా కొట్టారంటూ గొడవ చేశాడు. పోలీసుల ఎంత చెప్పినా మందుబాబు వినలేదు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. మందుబాబు ఓ బార్‌లో మద్యం తాగి గొడవ చేస్తున్నాడని అతడిని బార్‌ నుండి సిబ్బంది బయటకు పంపారు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపైకి నానా హంగామా చేశాడు. అతడు చేస్తున్న వింత చేష్టలను చూసి స్థానికులు ఆందోళన గురి అయ్యారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story