వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం

Dog born Elephant shape. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో శునకం కడుపున వినాయకుడి ఆకారంలో

By Medi Samrat  Published on  11 Oct 2021 9:25 AM GMT
వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో శునకం కడుపున వినాయకుడి ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కుక్క పిల్లకు తొండం, పెద్ద పెద్ద చెవులు ఉండటంతో దానిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు రెండేళ్లుగా ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెంచుకుంటున్న శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

మూడు పిల్లలు సాధారణంగా ఉండగా నాల్గవ పిల్ల వినాయకుని ఆకారంలో కనిపించడంతో దంపతులు ఆశ్చర్యపోయారు. కుక్క పిల్లకు తొండం, పెద్ద చెవులు ఉండటంతో సాక్షాత్తు వినాయకుడే తమ ఇంట పుట్టాడని యజమాని దనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట వినాయకుడు పుట్టాడని.. పూజలు చేస్తున్నారు. కుక్కపిల్ల జన్మించడంతో తన ఇంటి ముందు వినాయకుడి గుడి కట్టించాలని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.


Next Story
Share it