ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.

By -  Medi Samrat
Published on : 20 Nov 2025 3:49 PM IST

ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఈ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ విరాళాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని టీటీడీ తెలిపింది. ఈ నెల‌ 29న తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద సంస్థలు చేసే ప్రచారాలను నమ్మవద్దని, వారి వలలో పడి విరాళాలు ఇచ్చి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు.

Next Story