మహిళలే కాదు.. పురుషులు కూడా దిశ యాప్ ఉప‌యోగించ‌వ‌చ్చు

Disha App Awareness Campaign. ప్రతి ఒక్కరి మొబైల్స్ లో దిశ యాప్ ఉంటే పోలీస్ మీ చెంత ఉన్నట్లేన‌ని అని పౌరసరఫరాల శాఖ మంత్రి

By Medi Samrat
Published on : 30 July 2021 6:27 PM IST

మహిళలే కాదు.. పురుషులు కూడా దిశ యాప్ ఉప‌యోగించ‌వ‌చ్చు

ప్రతి ఒక్కరి మొబైల్స్ లో దిశ యాప్ ఉంటే పోలీస్ మీ చెంత ఉన్నట్లేన‌ని అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం గుడివాడ అలంకృత కల్యాణ మండపంలో దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం లో మంత్రి కొడాలి నాని, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశిల్ పాల్గొన్నారు. మహిళలు దిశ యాప్ వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్న పోలీస్ లు త్వరితగతిన మహిళలను రక్షించుకుంటాము అని జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్ అన్నారు. మహిళలే కాకుండా పురుషులు సైతం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ దిశ యాప్ ఉపయోగించుకోవటంతో.. తమ ప్రాణాలను పోలీసులు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంది అని స్పష్టం చేశారు.

దిశ యాప్ ఎలా వాడాలంటే? :

దిశ యాప్ వాడాలంటే.. యూజర్లు తమ మొబైల్ డివైజ్ లో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్‌ షేక్ చేయాలి. మొబైల్ డివైజ్ జీపీఎస్‌ను ఆటోమాటిక్ గా ఆన్ చేస్తుంది. ఆపై పుష్ బటన్ మెసేజింగ్ సిస్టమ్ సాయంతో అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను అలర్ట్ చేస్తుంది. దిశ యాప్ సమీప, భద్రతా స్థలాలు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన కాంటాక్టులు సహా మరిన్ని ఫీచర్లతో ఇంటిగ్రేడ్ అయి ఉంటుంది.

మహిళా భద్రతా యాప్ ద్వారా పోలీసు అధికారులు కాలర్‌ను త్వరగా ట్రాక్ చేయొచ్చు. ఇందులో ట్రాకింగ్ భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. సాయం కోసం యూజర్లు డయల్ 100 లేదా ఇతర హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడానికి SOS ఎంపికపై క్లిక్ చేయవచ్చు, అక్కడ యూజర్ సెంట్రల్ కాల్ సెంటర్‌కు, ఆ తరువాత సమీప పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుంది.


Next Story