టీడీపీకి బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేసిన దర్శకేంద్రుడు

Director Raghvendra Rao Intresting Comments On Chandrababu Naidu. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగు దేశం పార్టీ కేడర్ కు బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 27 Jun 2022 11:49 AM IST

టీడీపీకి బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేసిన దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగు దేశం పార్టీ కేడర్ కు బూస్ట్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేశారు. ఏపీలో మరో రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కె.రాఘవేంద్రరావు జోస్యం చెప్పారు. ప్రజల్లో రోజురోజుకు పార్టీపై ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అని అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు ఆదివారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నాయకులు నడవాలన్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి నందమూరి కుటుంబంతో అనుబంధం కలిగిన రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. రోజురోజుకూ ప్రజల్లో తెదేపాకు ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు.










Next Story