మొదటి నుండి చంద్రబాబును అలాగే ట్రీట్ చేస్తున్నాం : జైళ్ల శాఖ డీఐజీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మొదటి నుంచి హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామని..

By Medi Samrat  Published on  13 Oct 2023 2:32 PM GMT
మొదటి నుండి చంద్రబాబును అలాగే ట్రీట్ చేస్తున్నాం : జైళ్ల శాఖ డీఐజీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మొదటి నుంచి హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామని.. చంద్రబాబు భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జైల్లో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదని.. మొదటి నుంచి ఆయనను హైప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామన్నారు. చర్మ సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో రూల్స్‌ ప్రకారం వైద్యం చేయించామని వెల్లడించారు. తాగునీరు, భోజన విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో భద్రత ఉందని.. చంద్రబాబుకు సంబంధించిన భోజనాన్ని జైలర్ స్టాయి అధికారులు చెక్ చేస్తారని.. చంద్రబాబు బ్యారక్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఇతర ఖైధీలు అధికారులు, సిబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. పూర్తిస్థాయిలో ప్రికాషన్స్ తీసుకుంటున్నామని, సెక్యూరిటీ మెజర్మెంట్స్‌కు సంబంధించి ప్రతి 10 రోజులకు ఒకసారి అధికారులతో మాట్లాడుతామన్నారు. చంద్రబాబు రూమ్‌లో 8 ఫ్యాన్లు పెట్టాం.. నిరంతరం తిరుగుతూనే ఉన్నాయన్నారు జైళ్ల శాఖ డీఐజీ.

చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీలు ఉన్నారు. ఇపుడు 67 కేజీలు ఉన్నారని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు. చంద్రబాబుకు అవసరమైనన్ని వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేశాము. ఆయన శరీరంపై రేషస్ వచ్చాయి. జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ వైద్యులను రప్పించి పరీక్షలు చేయించాము. చంద్రబాబు జైల్లో అరోగ్యంగానే ఉన్నారు. హెల్త్ బులిటెన్ హెడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ ఇస్తారు. ఇకపై రెగ్యులర్‌గా చంద్రబాబు హెల్త్ బులిటన్ విడుదల చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయిలో అయితే లేదు. చంద్రబాబు మా దగ్గర రిమాండ్ ప్రిజనర్.. ఆయనకు కావాల్సిన జాగ్రత్తలను తీసుకుంటున్నామని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు.

Next Story