పంచాయతీ ఎన్నికలకు పూర్తి భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌, మద్యం, నగదు తరలింపుపై తనిఖీలు చేపడతామన్నారు. ఎలాంటి ఘటన జరిగినా.. తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.


పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని భావించిన ఎస్ఈసీ.. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలు సజావుగా జరిపేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడనివ్వొద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలోనూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తాయని పేర్కొంది.


సామ్రాట్

Next Story