టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటౌతుంది : దేవినేని ఉమ

టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు రాయుడుపాలెం చెరువుకు లిఫ్ట్ పెట్టి రూ. 37.28 లక్షలతో అభివృద్ధి చేసి 320 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని

By Medi Samrat  Published on  21 Feb 2024 9:03 AM GMT
టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటౌతుంది : దేవినేని ఉమ

టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు రాయుడుపాలెం చెరువుకు లిఫ్ట్ పెట్టి రూ. 37.28 లక్షలతో అభివృద్ధి చేసి 320 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. రూ. 23.70 లక్షలతో ఊర చెరువు కింద 150 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదేన‌న్నారు. ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ ఘనకార్యాలు ఏమిటంటే.. తాగడానికి, పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతన్నారని అన్నారు. పండిన పంటకు రేటు ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మైలవరంలో 600 రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సారథ్యంలో అన్నా క్యాంటీన్ నడుస్తోందన్నారు.

కేశినేని ఫౌండేషన్ ద్వారా శివనాథ్ అన్నా క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులతో చేస్తున్న సేవలు అభినందనీయమ‌న్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో టీడీపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటౌతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. 2014 లో దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మనం చేసిన పనులు చెప్పుకోలేక పోవడమే మన ఇబ్బంది.. అభివృద్ధి రావాలంటే తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకోవాలన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పోరాడే ఉమా లాంటి నాయకులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామ‌ని సూచించారు.

Next Story