నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

By Medi Samrat
Published on : 30 April 2024 3:45 AM

నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభ­లో.. మధ్యాహ్నం 12.30 గంటలకు కడప లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. మధ్యా­హ్నం 3 గంటలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభకు సీఎం జగన్‌ హాజరవ్వనున్నారు.

చంద్రబాబు నాయుడు పర్యటనలో చిన్న మార్పులు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీడీపీ నేతలు తెలిపారు.

Next Story