పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సూపర్ సిక్స్ -సూపర్ హిట్ విజయోత్సవ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో కరవును పారదోలి అభివృద్ధి పథంలో నడిపిస్తామని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.