మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా.. ఏమీ చేయలేకపోయాం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

By -  Medi Samrat
Published on : 19 Sept 2025 7:03 PM IST

మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా..  ఏమీ చేయలేకపోయాం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా, ఆ కేసులో ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిందనే విషయం అందరికీ తెలిసిన సత్యమని పవన్ అన్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 16న సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నిందితుల బెయిల్ రద్దు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

Next Story