ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయ‌న‌కే సాధ్యమైంది : పవన్ కల్యాణ్

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సు లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు .

By Kalasani Durgapraveen  Published on  11 Dec 2024 9:15 AM GMT
ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయ‌న‌కే సాధ్యమైంది : పవన్ కల్యాణ్

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సు లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు .

రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసిందన్నారు. భారీగా అవకతవకలకు పాల్పడిందని, ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారు. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లే అని అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు.. ఎన్నో పనులు చేయించారన్నారు. ఇంతమంది ఐఏఎస్ లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు.

గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది.. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్నారు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం..మీ అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అని తెలిపారు.

కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదన్నారు. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయి అని తెలిపారు. మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా? అన్నారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలని.. అందుకు ఐఏఎస్ లే బాధ్యత తీసుకోవాలని తెలిపారు .

Next Story