వాతావరణం అనుకూలించకపోయినా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు.

By Kalasani Durgapraveen
Published on : 20 Dec 2024 10:47 AM IST

వాతావరణం అనుకూలించకపోయినా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ పవన్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకు ప్రకారం - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు. సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్తారు. మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.19 నూతన రోడ్లకు శంకుస్థాపనలు ,దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి రానుంది.

ఇదిలావుంటే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు, రాష్ట్ర కార్యదర్శి ప్రశాంతి, భీమిలి ఇంఛార్జి పంచకర్ల సందీప్ స్వాగతం పలికారు.

Next Story