కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేసిన ఫైళ్ళు, రిపోర్టుల్లో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబధించినవి కూడా ఉండటంతో.. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని మండలి అధికారులను ఉప ముఖ్యమంత్రివ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఘటనకు కారకులెవరనే విషయాన్ని ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పీసీబీలో ఫైళ్ళు, రికార్డులు నిర్వహణ, వాటి భద్రతకు అనుసరిస్తున్న విధానాలను నివేదించాలని స్పష్టం చేశారు. నిరుపయోగమైన రికార్డులను, ఫైళ్లను తొలగించాలంటే ఉన్న నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నదీ కూడా వెల్లడించాలన్నారు. ప్రధాన కార్యాలయంలోనే కాకుండా జోనల్, రీజినల్ కార్యాలయాల్లో ఫైళ్ళు, రికార్డులు, రిపోర్టుల నిర్వహణపై కూడా దృష్టిపెట్టాలని, వాటి భద్రతపై తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు.