ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకల విషయంలో కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో ఇప్పటికే సెక్యూరిటీని పెంచేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి నో ఎంట్రీ అని పోలీసులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఎవరైనా వస్తున్నా.. 12 తర్వాత వస్తే సరిహద్దుల వద్దనే ఆపివేయనున్నారు. లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు పోలీసులు, ప్రభుత్వ.

ఏపీలో ప్రభుత్వం కర్ఫ్యూను విధిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పనివేళల మార్పును కూడా ఈ నెల 31వ తేదీ వరకు సర్కార్ పొడిగించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలులో ఉంటుందని చీఫ్ సెక్రటరీ అధిత్యనాధ్ దాస్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


సామ్రాట్

Next Story