ఆంధ్రప్రదేశ్ లో మరో పది రోజులు కర్ఫ్యూ పొడిగింపు
Curfew Extended In AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ను మరో పది రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 7 Jun 2021 8:07 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ను మరో పది రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 10 తేదీ తర్వాత కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అయితే రాబోయే రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో సడలింపు ఇవ్వనుంది.
కరోనా వైరస్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్షించారు. కర్ఫ్యూ సడలింపు సమయం పెంచిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కేసులను మరింత తగ్గించడానికి కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10 తర్వాత సడలింపు ఉంటుంది. మిగతా నియమ నిబంధనలు యధావిథిగా కొనసాగనున్నాయి.
ఈ నెల 10తో కర్ఫ్యూ గడువు ముగియనుంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కర్ఫ్యూ కొనసాగించడమే మేలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల పరిస్థితిపై అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. ఏపీలో కరోనా కేసులు భాగానే కట్టడి అవుతున్నాయని.. మరింత అప్రమత్తంగా ఉంటే పూర్తిగా కట్టడి సాధించవచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అందుకే ఇంకొద్ది రోజులు లాక్ డౌన్ ను పెంచారు.