బిగ్‌బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టివ‌ర‌కంటే..

Curfew Extended In AP. ఏపీ వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో పగటి పూట కర్ఫ్యూను కఠినంగా

By Medi Samrat  Published on  31 May 2021 1:58 PM IST
బిగ్‌బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టివ‌ర‌కంటే..

ఏపీ వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో పగటి పూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. నేటితో ముగుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై కఠినంగానే ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరో పది రోజులు పాటు కర్ఫ్యూను పొడిగించింది. తాజాగా జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు అని ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో కరోనా కేసులు, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ నేడు సమీక్షించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో స‌మావేశ‌మైన సీఎం జ‌గ‌న్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదివ‌ర‌కు స‌డ‌లింపులు మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇదిలావుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 84,232 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 13,400 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16,85,142కి చేరింది. నిన్న 21,133 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 15,08,515కి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 94 మంది మరణించగా.. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,832కి చేరింది.




Next Story