సచివాలయంలోని పలు కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన సీఎస్

CS Jawahar Reddy made a surprise visit to many offices in the Secretariat. అమరావతిలోని సచివాలయం మూడో బ్లాక్ లోని పలు కార్యాలయాలను ప్రభుత్వ ప్రధాన కార్?

By Medi Samrat
Published on : 16 Dec 2022 4:10 PM IST

సచివాలయంలోని పలు కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించిన సీఎస్

అమరావతిలోని సచివాలయం మూడో బ్లాక్ లోని పలు కార్యాలయాలను ప్రభుత్వ ప్రధాన కార్?డా.కె.ఎస్.జవహర్ రెడ్డి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం 11.00 గంటల సమయంలో మూడో బ్లాక్ లోని మొదటి అంత్తసులోని సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాలను ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలోని పలు సెక్షన్లను పరిశీలిస్తూ సిబ్బంది వివరాలు, వారు చేసే పనులపై ఆయన ఆరాతీశారు. గ్రౌండ్ ప్లోర్ లోని ఉద్యోగుల గ్రంధాలయాన్ని ఆయన సందర్శించి ప్రతి రోజు ఎంత మంది ఉద్యోగులు ఈ గ్రంధాలయాన్ని సందర్శిస్తున్నారు, ఎంత మంది గ్రంథ పఠనం చేస్తున్నారు అనే విషయాలను లైబ్రేరియన్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సెంట్రల్ రికార్డు రూమ్ ను సందర్శించి రికార్డులు భద్రపర్చే ర్యాక్ లను ఆయన పరిశీలిస్తూ రికార్డులు భద్రపరిచే పక్రియను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఉద్యోగుల క్యాంటీన్ను ఆయన సందర్శించి ఉద్యోగులకు రాయితీపై అందజేస్తున్న అల్పాహార, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిస్పెన్సరీలోని పలు విభాగాలను, ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్ ను, ఎస్.బి.ఐ. బ్రాంచ్ ను సి.ఎస్. డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సందర్శించారు.




Next Story