మూడు రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు : సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Wrote letter to CM Jagan. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు.

By Medi Samrat
Published on : 11 Feb 2023 4:03 PM IST

మూడు రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు : సీపీఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండని లేఖ‌లో రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఫలుమార్లు స్పష్టం చేసింది. నాడు జగన్ మోహ‌న్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా.. అమరావతిని రాజధానిగా అంగీకరించారని లేఖ ద్వారా గుర్తుచేశారు. ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది. మూడు రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. మూడు రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండని లేఖ‌లో సీఎంను కోరారు.


Next Story