విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తో సహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసుల మోహరింప చేశారు. ముళ్ల కంచెలు వేశారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా.? పోలీస్ రాజ్యమా.? అని రామకృష్ణ ప్రశ్నించారు.