ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చకండి

CPI Ramakrishna Fires On CM Jagan. ఆంధ్రప్రదేశ్ ను ఆదానీ ప్రదేశ్ గా మార్చకండని.. జగన్, గౌతమ్ అదానీల మధ్య జరిగిన

By Medi Samrat  Published on  23 Sept 2021 12:59 PM IST
ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చకండి

ఆంధ్రప్రదేశ్ ను ఆదానీ ప్రదేశ్ గా మార్చకండని.. జగన్, గౌతమ్ అదానీల మధ్య జరిగిన రహస్య భేటీ వివరాలను వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకై అదానీకి అవకాశం ఇస్తూ హడావుడిగా ఏపీ క్యాబినెట్లో తీర్మానాలు ఎందుకు? అని ప్ర‌శ్నించారు. నాలుగైదు కంపెనీలకు దక్కాల్సిన సౌర విద్యుత్ ప్లాంట్ ను అదానీ ఒక్కడికే కట్టబెట్టడంలో లొసుగులేంటి? అని నిల‌దీశారు.

గంగవరం, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులను జగన్ సర్కార్ అదానీ గ్రూప్ కు కట్టబెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలోని పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ సంస్థలు ఆదానీకి అప్పగించడంలో లాలూచీ ఏంటి? అని ప్ర‌శ్నించారు. మచిలీపట్నం పోర్ట్ ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరిగాయని.. ఏపీలో పెద్ద సంస్థలు, బడా కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ కేవలం గుజరాత్ కు చెందిన సంస్థలకే అవకాశం ఇవ్వడం వెనుక మర్మమేంటో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. జగన్ గారు.. సీఎం కుర్చీ కూడా ఆదానీకే అప్పగించండని ఎద్దేవా చేశారు రామకృష్ణ.


Next Story