ఆ ఎస్ఐ, కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయాలి

CPI Ramakrishna Demands For SI Suspension. కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సై మునిప్రతాప్, కానిస్టేబుల్ రామకృష్ణలను వెంట‌నే సస్పెండ్ చేయాలని

By Medi Samrat
Published on : 14 March 2022 10:26 AM IST

ఆ ఎస్ఐ, కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయాలి

కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సై మునిప్రతాప్, కానిస్టేబుల్ రామకృష్ణలను వెంట‌నే సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిపిఐ కార్యదర్శి విరుపాక్షపై పోలీసుల దాష్టీకాన్ని ఖండిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఎస్ఐ మునిప్రతాప్ అతని సిబ్బంది వికలాంగుడైన విరూపాక్షను అర్థనగ్నంగా వీధులలో నడిపించి, అతని భార్య, తల్లి, చిన్నమ్మలను అవమానించి, దౌర్జన్యం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు గూండాల్లా వ్యవహరించడం తగదని అన్నారు. సాక్షాత్తు పోలీసులే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గమ‌ని.. విరూపాక్షపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.











Next Story