వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవా.? ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి

CPI Ramakrishna Demands For Anantha Babu Arrest. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు

By Medi Samrat
Published on : 20 May 2022 12:40 PM IST

వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవా.? ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి

కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి.. మృతదేహాన్ని అనంతబాబు కారులో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఎలా అప్పగిస్తారు.? సుబ్రహ్మణ్యం నిజంగా యాక్సిడెంట్ లో చనిపోతే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఎలా తరలించారు? అని అనుమానం వ్య‌క్తం చేశారు. వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవా? అని ప్ర‌శ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు చేపట్టాలని రామకృష్ణ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.






Next Story