పొగడ్తలేనా..? అభివృద్ధిపై చర్చలేమైనా ఉన్నాయా?

CPI Ramakrishna Criticises On YCP Plenary. వైయస్సార్సీపి ప్లీనరీలో కేవలం పొగడ్తలేనా? రాష్ట్ర అభివృద్ధిపై చర్చలేమన్నా ఉన్నాయా?

By Medi Samrat  Published on  9 July 2022 2:55 AM GMT
పొగడ్తలేనా..? అభివృద్ధిపై చర్చలేమైనా ఉన్నాయా?

వైయస్సార్సీపి ప్లీనరీలో కేవలం పొగడ్తలేనా? రాష్ట్ర అభివృద్ధిపై చర్చలేమన్నా ఉన్నాయా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూటి ప్రశ్న వేశారు. వైఎస్ఆర్సిపి ప్లీనరీ జరుపుకోవటం సంతోషం.. కాని రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని విమ‌ర్శించారు. ఏపీ అప్పులు 8 లక్షల కోట్లకి చేరాయని.. కేవలం లక్షా 60 వేల కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని వివ‌రించారు.

మిగిలిన అప్పు 4 లక్షల కోట్లతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 31 మంది వైసీపీ ఎంపీలున్నా కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా హామీ ఏమైంది.. ఏపీలో కొత్తగా ఒక్క పరిశ్రమనైనా రాబట్టారా? అని ప్ర‌శ్నించారు. కేంద్రం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతు ఇవ్వడం తప్ప.. కేంద్రం నుంచి ఏపీకి ఏదైనా మేలు చేకూర్చగలిగారా? అని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం ఏపీకి చేసిన ద్రోహాలపై ప్లీనరీలో చర్చించాల‌ని రామకృష్ణ సూచించారు.













Next Story