పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గిస్తే ఎవరికి ప్రయోజనం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించారు. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో లీటర్ కు రూ.10లు అధికంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. సినిమా టిక్కెట్ ధరలను తగ్గిస్తూ జీవో ఇచ్చారు.. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడివున్న పెట్రో ధరలు తగ్గించకుండా మద్యం ధరలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం తమిళనాడుతో సమానంగా తగ్గించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.