అమిత్ షా క్షమాపణ చెప్పాలి.. ఆయ‌న‌ మాటలు ప్రజాస్వామ్య వ్యతిరేకం : సీపీఐ నారాయణ

CPI Narayana Responds On Amit Shah Comments. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం

By Medi Samrat
Published on : 24 April 2023 6:15 PM IST

అమిత్ షా క్షమాపణ చెప్పాలి.. ఆయ‌న‌ మాటలు ప్రజాస్వామ్య వ్యతిరేకం : సీపీఐ నారాయణ

CPI Narayana


భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజా స్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన వీడియో ద్వారా త‌న ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణా లో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం లకు రిజర్వేషన్ తీసేస్తామని హోంమంత్రి చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్ని మతాల్ని,కులాలను కలుపుకుని పోవాలని కీలక సమావేశాల్లో చెప్పారన్నారు. అధికారం కోసం పాకులాడే వాళ్ళు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చు అన్నారు. అలా కాకుండా మతతత్వాలు రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు.

గతంలో సీపీఐ నాయకుడు చండ్రరాజేశ్వర్ రావు ముస్లింల స్థితి గతులు పరిశీలించి నపుడు దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని పరిశీలన చేసి చెప్పారని అన్నారు. అంతేకాకుండా సచార, శ్రీరంగరాజ కమిటీ పరిశీలనలో కూడా ముస్లింలు ఎక్కువ శాతం పేదరికం లో ఉన్నారని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 శాతం నుంచి 4 శాతం కు రిజర్వేషన్లు తగ్గించినట్లు చెప్పారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న హోమ్ మంత్రి అమిత్ షా మతతత్వాలు రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంద‌ని చెప్పారు.


Next Story