జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ చేసుకోవచ్చు

Court Green Signal For Election Counting. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఉన్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

By Medi Samrat  Published on  16 Sep 2021 6:32 AM GMT
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ చేసుకోవచ్చు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిలిచిపోయిన కౌనటింగ్ ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్‌ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్‌ఈసీ పేర్కొంది. హైకోర్టు కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ అప్పీల్‌‌పై మరోసారి విచారణకు రాగా తీర్పు రిజర్వ్ చేశారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.


Next Story
Share it