వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. తన పెద్ద కుమార్తెను చూసేందుకు ఇటీవల వైఎస్ జగన్ లండన్ వెళ్లారు. అయితే బెయిల్ షరతులను ఉల్లంఘించారని, అలాగే తన సొంత ఫోన్ నంబర్‌ను వెల్లడించలేదని సీబీఐ పిటిషన్ చేసింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు జగన్‌కి కాల్ చేసినా నెంబర్ పని చేయలేదని పిటిషన్‌లో తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే పని చేయని నెంబర్ ఇచ్చారని సీబీఐ వాదనలు వినిపించింది. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
జగన్ తన కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్లారు. 10 రోజుల పాటు లండన్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఎప్పటిలాగే బెయిల్ షరతుల్లో భాగంగా తాను అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్ నంబర్ ను కూడా సీబీఐకి ఇచ్చారు. గతంలో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈసారి ఇచ్చిన నంబర్ కూ మధ్య వ్యత్యాసం ఉండటంతో సీబీఐ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.