ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు

Containment Zones In P Gannavaram. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా కోనసీమ విషయంలో

By Medi Samrat  Published on  21 July 2021 6:33 PM IST
ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా కోనసీమ విషయంలో అధికారులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. రోజువారీ కరోనా కేసుల సంఖ్య చూస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో మళ్లీ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. కరోనా తీవ్రత పెరగకుండా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ లోకి కొనసీమ వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తపడాలని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి కోరారు. మొదటి, రెండవ దశల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని థర్డ్ వేవ్ లోకి కొనసీమను తీసుకెళ్లకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.


పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మండలంలో పాజిటివ్ రేట్ అధికంగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇవాల్టి నుండి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. మిగతా సమయాల్లో కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మూడవ దశ కోవిడ్ బారిన పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


Next Story