పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు.. ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు ఉప ముఖ్యమంత్రి చేసినపుడు నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, భారతదేశాన్ని కాపాడే పార్టీ అన్నారు. నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే.. 7 రేస్ కోర్స్ లో డాన్స్ వేసుకుంటూ కూర్చోవాలి.. లేకుంటే రాజకీయాలు మానేసి, రెండు సినిమాలు తీసి నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలని సూచించారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా మనోభావాలు, ప్రజల, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడవద్దన్నారు. మీ నాయకుని లెక్క మేము కుల మతాల మధ్య చిచ్చు పెట్టట్లేదు.. నిజంగా నిలదీయాలి అంటే మీ నాయకునినే నిలదీయాలని సూచించారు. నలుగురు వచ్చి కాల్చిపోతే మీరు పిట్ట కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అడగవలసింది.. నలుగురు ముష్కరులు 28 మందిని చంపితే.. వారం రోజుల నుండి అరెస్టు చేయకుండా ఉంటే.. ఎవరి వైఫల్యం జరిగిందో.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఇంటెలిజెన్స్ వైపల్యమా.? అడగాలన్నారు. కాశ్మీర్‌లో 370 పెట్టి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన అన్న నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు.