వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలు ఉల్లఘించి జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చాం. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమేనని తెలిపారు. అయితే కొంతమంది బహిరంగ సభ తరహాలో జనసమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై గట్టి నిఘా ఉంచామని, కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు ఎస్పీ మణికంఠ. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు.
జులై 9న వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ స్వయంగా బంగారుపాళ్యం వెళ్తున్నారు.