ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే.. 17 మంది కొత్తవారే
టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎంగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 6:35 AM ISTఏపీ మంత్రివర్గ జాబితా ఇదే.. 17 మంది కొత్తవారే
టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎంగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటు మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉండనున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు.
చంద్రబాబు నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుంది. 8 మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరిని , వైశ్యుల నుంచి ఒకరిని పదవి వరించింది. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో పది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.
మంత్రి వర్గ జాబితా ఇదే
అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్.