సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలరెడ్డి నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  21 Jun 2024 2:10 PM IST
సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలరెడ్డి నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక‌ పారదర్శకంగా జరుగలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా రెడ్డి, ఆమె అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రో కో మాదిరిగా వ్యవహరించారని.. వారి పోకడల కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల్లో తీవ్రప్రభావం పడిందని అన్నారు.

అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం అందించిన నిధులు సైతం గోల్ మాల్ అయ్యాయని వారు ఆరోపించారు. అధిష్టానం షర్మిల రెడ్డిని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించినపుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నామ‌ని.. కానీ ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సమర్థులైన వారికి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని.. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ క్యాడర్, నాయకులను నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు.

తెలంగాణకు చెందిన షర్మిలా రెడ్డికి చెందిన కొందరు అనుయాయులు ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల టికెట్ అంశాల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికి B ఫార్మ్ కేటాయించారని.. CWC మెంబెర్స్, సీనియర్ నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, డీసీసీ ప్రెసిడెంట్స్ సూచనలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

Next Story