త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి
త్వరలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం: సీఎం చంద్రబాబు
అమరావతి: వీలైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి వైఎస్ జగన్ మోసం చేశాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదిల్చలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. 'ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జగన్ పక్కనపెట్టాడు. దీంతో పోలవరం నిర్మాణం ఖర్చు భారీగా పెరిగిపోయింది. 2027 నాటికి పూర్తి చేసి తీరుతాం' అని ఆయన పేర్కొన్నారు.
వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్ పట్టించుకోలేదని అన్నారు. రైతులు త్యాగం చేసి పోలవరం భూములు ఇచ్చారని, అయితే వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. మొన్నటి వరకు నిర్వాసితులను పట్టించుకున్న వారే లేరని, తాము త్వరలోనే పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ఇన ఒప్పించి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశామన్నారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు సొమ్మను ఇతర పథకాలకు మళ్లించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. నిర్వాసితుల ఖాతాలో నేరుగా రూ.829 కోట్లు వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2027 నవంబర్ నాటికి పునరావసం పూర్తి చేస్తామన్నారు.