సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం.. ఆ అంశంపైనే చ‌ర్చ‌..!

వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది.

By Medi Samrat
Published on : 18 July 2025 3:02 PM IST

సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం.. ఆ అంశంపైనే చ‌ర్చ‌..!

వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. ఈ స‌మావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై చర్చ జ‌రిగింది. ఈ సమావేశానికి మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో ఇతర రాష్ట్రాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరుపై చర్చ జ‌రిగింది. పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైనా సమావేశంలో చర్చించిన మంత్రుల కమిటీ మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

Next Story