ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో కమెడియన్‌ అలీ భేటీ.!

Comedian Ali meets AP CM YS Jagan. ప్రముఖ సినీ కమెడియన్‌, వైసీపీ నాయకుడు అలీ.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు

By అంజి
Published on : 15 Feb 2022 5:55 PM IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో కమెడియన్‌ అలీ భేటీ.!

ప్రముఖ సినీ కమెడియన్‌, వైసీపీ నాయకుడు అలీ.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో అలీ సమావేశం అయ్యారు. కాగా అలీకి రాజ్యసభ సీటును ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇటీవల జరిగిన సినీ ఇండస్ట్రీ సమస్య పరిష్కారం సీఎం జగన్‌ను కలిసిన పులువురు ప్రముఖుల్లో అలీ కూడా ఉన్నారు. తాజాగా సీఎం జగన్‌తో అలీ భేటీ కావడంపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌కు మద్దతుగా అలీగా ప్రచారం చేశారు.

ఈ క్రమంలోనే జగన్‌ ప్రభుత్వంలో అలీకి స్థానం కల్పించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సీఎం జగన్‌ను అలీ కలవడంతో.. రాజ్యసభ సీటు ఖరారైందని వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. దీనిలో ఒక స్థానాన్ని మైనార్టీ వర్గానికి కేటాయించనున్నారని ప్రచారం జరుగుతుండగా.. ఆ సీటును అలీకి ఇచ్చేలా సీఎం జగన్‌ మొగ్గు చుపుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు.

Next Story