అదనపు ఆదాయంపై కూటమి సర్కార్ ఫోకస్..రద్దయిన పథకం పునరుద్ధరణ
నాలుగు దశాబ్దాల కిందట రద్దైన ఆంధ్రప్రదేశ్ లాటరీని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
By - Knakam Karthik |
అదనపు ఆదాయంపై కూటమి సర్కార్ ఫోకస్..రద్దయిన పథకం పునరుద్ధరణ
అమరావతి: నూతన సంవత్సరంలో కూటమి సర్కార్ మరో కీలక పథకం తేనుంది. ఇప్పటికే ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు దశాబ్దాల కిందట రద్దైన ఆంధ్రప్రదేశ్ లాటరీని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా సుమారు 3 వేల కోట్లు రుపాయిలు ఆదనంగా సర్కార్ ఖజానాకు రానుంది. మరో వైపు వివిధ కొత్త విధానాల ద్వారా ఏటా సుమారు 11,700 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు సర్కార్ ప్లాన్ సిద్దం చేసింది.
ఇప్పటికే బార్ & రెస్టారెంట్లలో మద్యం మరింత ప్రియం కానుంది. బార్లలో అమ్మే మద్యంపై అదనపు వ్యాట్ విధించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 1300 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం రానుంది. మరో వైపు ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విధించి ఏటా 1400 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూర్చుకోవాలని తొలుత ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
అయితే ఆన్-లైన్ గేమింగ్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించటంతో కొత్త మార్గాలను అలోచిస్తుంది. ఇప్పటికే నూతన వాహానాలపై రోడ్ సెస్ పది శాతం పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా ఆదనంగా మరో 100 కోట్లు సర్కార్ ఖజనాకు రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్నంతగా ప్రభుత్వానికి అదాయం రావడం లేదు..ఆదాయార్జన శాఖల కు సిఎం చంద్రబాబు అదేశాలకు అనుగుణంగా ఆర్ధిక శాఖ కొత్తగా వివిధ విధానలను అధ్యయనం చేస్తోంది..మొత్తంగా ఏడాదికి సుమారు 12 వేల కోట్ల రుపాయిలు ఆదాయం అదనంగా వచ్చే అంశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.