రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

CM YS Jagan Visits For Guntur On 7th. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు గుంటూరు జిల్లాకు వెళుతున్నారు

By Medi Samrat  Published on  6 Jun 2022 4:42 AM GMT
రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు గుంటూరు జిల్లాకు వెళుతున్నారు. గుంటూరు జిల్లాలో మంగళవారం నాడు పర్యటించనున్నారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. మెగా మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. హరిత నగరాలు కింద పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వారి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.

'వైఎస్సార్ యంత్ర సేవ' పథకం క్రింద రాష్ట్ర స్థాయి మెగా మేళా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జూన్ 7వ తేది నాడు రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తీ చేశారు అధికారులు. పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉన్నారు.










Next Story