ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తుళ్ళూరు పర్యటన

CM YS Jagan visit to Tullur of Guntur district On 26th. సీఎం వైఎస్‌ జగన్ శుక్ర‌వారం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat
Published on : 24 May 2023 7:45 AM

ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తుళ్ళూరు పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ శుక్ర‌వారం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్య‌క్ర‌మం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story