ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎం జగన్‌

CM YS Jagan to participate in a video conference with PM Modi to discuss of G-20 summit preparations. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో

By అంజి  Published on  9 Dec 2022 4:25 PM IST
ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎం జగన్‌

ఇవాళ సాయంత్రం 5 గంటలకు పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా జరగనున్న జీ-20 సదస్సుల్లో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో ఏపీలో మూడు సదస్సులు నిర్వహించేందుకు ప్రధాని ప్లాన్ చేస్తున్నారు.

విశాఖపట్నం వేదికగా జి-20 సదస్సు జరిగే అవకాశం ఉంది. కాగా, జీ-20 అధ్యక్షుడిగా భారత్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, పలు కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలపై 200 సదస్సులు నిర్వహించబోతున్నారు. ఇటీవల ఢిల్లీలో జీ-20 సదస్సుకు సంబంధించి ఆల్‌ పార్టీ మీటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.

Next Story