మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

CM YS Jagan Console Minister Adimulapu Suresh Family. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించారు.

By Medi Samrat
Published on : 27 Dec 2022 3:40 PM IST

మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించారు. ఎర్రగొండపాలెంలో పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నివాసంలో ఆయన కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్ పరామర్శించారు. ఆదిమూలపు సురేష్‌ మాతృమూర్తి థెరీసమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి జగన్‌.. అనంత‌రం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్‌ మాతృమూర్తి థెరీసమ్మ ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూశారు. హైద్రాబాద్‌లో చికిత్స‌పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతిచెందారు. సోమ‌వారం సాయంత్రం మార్కాపురంలో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.



Next Story