రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా..

By Medi Samrat  Published on  1 Nov 2023 11:13 AM GMT
రేపు సీఎం జగన్‌ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌లో 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేర‌కు అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

ఉదయం 7.35 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ రుషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌లో 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ కాంగ్రెస్‌ ప్లీనరీ (ఐసీఐడీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Next Story