రేపు సీఎం జగన్ నెల్లూరు పర్యటన

CM Jagan's visit to Nellore tomorrow. రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు

By Medi Samrat  Published on  6 Dec 2022 6:45 PM IST
రేపు సీఎం జగన్ నెల్లూరు పర్యటన

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సీఎం జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. అనంత‌రం.. నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు.

ఉదయం 11.50 గంట‌ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న జయహో బీసీ మహాసభకు సీఎం హాజరవుతారు. తర్వాత 2.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. 3.55 – 4.10 వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story