చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 26న చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట

By Medi Samrat  Published on  23 Feb 2024 6:39 PM IST
చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

సీఎం వైఎస్‌ జగన్ ఈ నెల 26న చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటి విడుదల చేయ‌నున్నారు. అనంతరం శాంతిపురం మండలంలో జ‌రిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

26వ తేదీ ఉదయం 8.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రామకుప్పం మండలం రాజుపేట చేరుకుంటారు. అక్కడ కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేసిన అనంతరం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Next Story